Namaste NRI

మాన్షన్‌ 24 లో సవాల్‌ విసిరే పాత్ర చేశా

వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సత్యరాజ్‌,  అవికా గోర్‌, నందు, బిందు మాధవి, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న చిత్రం మాన్షన్‌ 24. దర్శకుడు ఓంకార్‌. హైదరాబాద్‌లో  జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వరలక్ష్మి మాట్లాడుతూ  మా ఇంట్లో రాత్రిపూట హారర్‌ ఫిల్మ్స్‌ చూడం. కాబట్టి డే టైమ్‌లో అన్ని ఎపిసోడ్స్‌ చూస్తాను. ఇందులో నాకు సవాల్‌ విసిరే పాత్ర దొరికింది. తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే యువతిగా నటించాను అన్నారు.

 సత్యరాజ్‌ మాట్లాడుతూ నేను దయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ మాన్షన్‌ 24 ట్రైలర్‌ చూసిన తర్వాత భయం వేసింది. హారర్‌ ఫిల్మ్స్‌తో మెప్పించాలంటే దర్శకుడికి ఫిల్మ్‌ మేకింగ్‌లో కొన్ని గిమ్మిక్స్‌ తెలిసి ఉండాలి. అలాంటివి ఓంకార్‌కు బాగా తెలుసు అన్నారు. దర్శకుడు ఓంకార్‌ మాట్లాడుతూ నేను రూపొందించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసే మంచి సిరీస్‌. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరం కష్టపడి పని చేశాం  అన్నారు.  తెలుగు తప్ప ఇతర భాషల్లోకి వెళ్లలేకపోయున తనకు మాన్షన్‌ 24 తో సౌత్‌ లాంగ్వేజె్‌సలోకి వెళ్లే అవకాశం వచ్చిందని రాజీవ్‌ కనకాల చెప్పారు. ఈ వెబ్‌ సిరీ్‌సలో ఎమోషన్‌, సెంటిమెంట్‌, హారర్‌ అన్నీ ఉన్నాయని శ్రీమాన్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events