Namaste NRI

ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారు.. రాత్రైతే ప్రజలపై

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారని కానీ, రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారని వ్యాఖ్యానించారు. పుతిన్‌ దుర్మార్గపు ప్రవర్తన తమకు నచ్చట్లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు మాస్కోపై కొత్త ఆంక్షలు విధించే యోచన చేస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలియజేశారు. రష్యాపై కొత్తగా, కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై స్పష్టత ఇవ్వగలము అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News