Namaste NRI

ఆయ‌న భార‌త‌, అమెరికా చ‌ట్టాల‌ను ఉల్లంఘించారు : రాహుల్ గాంధీ

అదానీ గ్రూపు సంస్థ ఓన‌ర్ గౌతం అదానీపై అమెరికా కోర్టులో నేరాభియోగాలు న‌మోదు అయ్యాయి. న్యూయార్క్ జ‌డ్జి త‌న ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ  స్పందించారు. గౌతం అదానీ భార‌తీయ‌, అమెరికా చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు స్ప‌ష్టం అవుతున్న‌ద‌ని రాహుల్ ఆరోపించారు. మోదీ, అదానీ క‌లిసి ఉంటే, ఆ ఇద్ద‌రూ ఇండియాలో క్షేమంగా ఉంటార‌ని రాహుల్ పేర్కొన్నారు. అదానీని త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌న్నారు. మ‌ద‌హ‌బి పురి బుచ్‌ను ఈ కేసులో విచారించాల‌న్నారు.

ప్ర‌తిపక్ష నేత‌గా ఈ అంశాన్ని లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తుతాని రాహుల్ చెప్పారు. అదానీ నేరాల‌పై జేపీసీ విచార‌ణ జ‌రిపించాల‌న్న డిమాండ్ కొన‌సాగుతుంద‌న్నారు. భార‌త స‌ర్కారు గౌతం అదానీకి ర‌క్ష‌ణ‌గా నిలుస్తోంద‌ని, ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం కానీ విచార‌ణ చేయ‌డం కానీ జ‌ర‌గ‌ద‌ని గ్యారెంటీ ఇస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ తెలిపారు. గౌతం అదానీ ఎందుకు ఈ దేశంలో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రెండు వేల కోట్ల స్కామ్‌తో పాటు ఇత‌ర కుంభ‌కోణాల్లో ఆయ‌న పాత్ర ఉన్న‌ట్లు తెలిసినా ప్ర‌భుత్వం ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని రాహుల్ గాంధీ అడిగారు.  దేశంలోని ముఖ్య‌మంత్రుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని, కానీ అదానీ మాత్రం ప‌రారీ అవుతున్న‌ట్లు ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నాళ్ల నుంచో ప్ర‌శ్నిస్తున్నామ‌ని, కానీ గౌతం అదానీని ప్ర‌ధాని మోదీ ర‌క్షిస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ స్కామ్‌లో ప్ర‌ధాని మోదీ పాత్ర ఉన్న‌ట్లు కూడా ఆరోపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress