Namaste NRI

ప్రవాసుల కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ఎన్నారైల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించేందుకు సన్‌షైన్‌ ఆసుపప్రతితో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆస్పుపత్రి ఎండీ డా.ఏ.వి.గురవారెడ్డి మాట్లాడుతూ ఎన్నారై కుటుంబసభ్యులకు ఆప్యాయ హెల్త్‌కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.7,500 బేసిక్‌ కార్డు తీసుక్నువారికి  తమ వైద్య బృందాలు వారి ఇంటికెళ్లి ఆసుపత్రిలో చేర్చడం, వైద్యం అందించడంతో పాటు సరైన సూచనలు, సలహాలు  ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో నివసించే తెలుగు ఎన్నారై కుటుంబాలకు ఈ కార్డులు అందిస్తునామని, త్వరలోనే అన్ని దేశాల్లో ఎన్నారైలకు వర్తింపజేస్తామని వెల్లడిరచారు. సన్‌షైన్‌`కిమ్స్‌ ఆసుపత్రుల్లో ఈ కార్డు తీసుకున్నవారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని, అడ్వాన్స్‌డ్‌ కార్డుతో వైద్య బీమా సహా అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి, పలువురు ఎన్నారైలు, తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events