Skip to main content

Namaste NRI

లవ్ గురు మూవీ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్

విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ రోమియో  మూవీ తెలుగులో లవ్ గురు గా విడుదల కాబోతోంది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చెల్లెమ్మవే అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే ఆలపించారు. చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే… ఆ ఆటలో ఎద కృంగెనే  అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాప కాలతో ఎమోషనల్‌గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందనే విషయం ఈ పాటతో వెల్లడవుతోంది.  వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News