75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన భారీ వర్షాలు యూఏఈని అతలాకుతలం చేసిన నేపథ్యం లో ఈ వర్షాల కారణంగా ప్రభావితమైన భారతీయుల సహాయార్ధం దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. +971501205172, +71569950590, +971507347676, +971585754213 నంబర్లను సంప్రదించి భారతీయులు సహాయం కోరవచ్చని తెలిపింది. వర్షాలతో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం యూఏఈ అధికారులు, విమానయాన సంస్థలతో సంప్రదింపు లు జరుపుతున్నట్టు తెలిపింది.