Namaste NRI

అందుకే కొండా బయోపిక్‌ తీశా : రామ్‌గోపాల్‌ వర్మ

కొండా మురళి,  కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొండా. త్రిగుణ్‌, ఇర్రా మోర్‌ నటించారు.  ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు వాస్తవిక గాథల్ని తెరకెక్కించాం. వాటిలో  కొండా మురళి, సురేఖ కథలు కొత్తగా అనిపించాయి. ఇలాంటి వ్యక్తుల గురించి ఇంతకు ముందు ఎక్కడా వినలేదు, చదవలేదు. చాలా ప్రత్యేకంగా కనిపించాయి. వారిద్దరి రిసెర్చ్‌ చేశా. ఇంకా ఆసక్తి పెరిగింది. అందుకే కొండా బయోపిక్‌ రూపొందించా అన్నారు. కొండా మురళీ పాత్రలో నేను ఇలా కనిపిస్తానని ఎప్పుడు అనుకోలేదు. నేను హైదరాబాద్‌లో పెరిగా. వర్మ కథ చెప్పాక. వరంగల్‌ వెళ్లి ఆ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దొరికింది అని అన్నారు హీరో త్రిగుణ్‌. నిర్మాత మాట్లాడుతూ 1980 నేపథ్యంలో జరిగే కథ ఇది. వర్మ వాస్తవానికి చాలా దగ్గరగా తీశారు. మా అమ్మానాన్నల కథ ఇది. వాళ్ల జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నేతగా ఎదిగారు. నా అభిమాన దర్శకుడు వర్మ. ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. నాన్న మురళి పాత్రలో త్రిగుణ్‌ అద్భుతంగా నటించారు అన్నారు. కొండా సుష్మిత పటేల్‌ నిర్మాత. ఈ సినిమా ఈ నెల 23న  విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events