Namaste NRI

హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025: ఫ్లోరిడా- ఒక అరుదైన, అత్యున్నత స్థాయి మెడికల్ కాన్‌ఫరెన్స్

హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 నా విజన్ ని నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, విద్యనందించడానికి రూపొదించబడిన ఒక కార్యక్రమం ఇది. ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, USA CME చైర్పర్సన్ గా, ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి నాకు ఇది ఒక సదవకాశం.

ఈ కాన్‌ఫరెన్స్ ఎనర్జీ చాలా స్పష్టంగా కనిపించింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసింది. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో వేదిక మొదలైంది. వీరు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.

గౌరవనీయ చైర్‌పర్సన్ డాక్టర్   సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్‌లను పరిష్కరించడం, నిరంతర అవగాహన అవసరం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన  వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి,  సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని అన్నారు . హాజరైన వారు 10 గంటల CMA క్రెడిట్‌లను సంపాదించారు, ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే మా లక్ష్యాన్ని బలోపేతం చేశారు. ఆయన AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను అభినందించారు.

ప్రత్యేక ఆకర్షణలు;

NFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సుకి అదనపు ఆకర్షణ. క్యాన్సర్‌పై ప్రజా అవగాహన, సమాజ భాగస్వామ్యం గురించి తను మాట్లాడటం చాలా ఆసక్తిగా అనిపించింది.

ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరొక ఆకర్శణగా నిలిచింది. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు.

డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ నిజంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించడం ఈ సెషన్ ముఖ్యాంశము.

వాలంటీర్ల దృక్పదం:

స్పీకర్లకి మించి, కాంగ్రెస్ మా స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. సెషన్‌లు, ఆసక్తిక్రమైన చర్చలు, డాక్టర్ల నైపుణ్యం పట్ల తమ ప్రశంసను పంచుకున్నారు. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉంది అని తెలియజేసారు. 

ఆడియన్స్ అభిప్రాయాలు:

కాన్‌ఫెరెన్స్ ప్రముఖ వక్తలలో ఒకరు, మహిళల క్యాన్సర్‌లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా ఈ కాంఫెరెన్స్లో ప్రస్తావించారో తమ అభిప్రాయాల ద్వార తెలియ చెప్పారు.

హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు:

ఈ సవంత్సరపు కాంఫరెన్స్ ముగిస్తూనే, 2026 కోసం ఎదురుచూస్తున్నాము. వచ్చే సంవత్సరం కార్యక్రమం ఓహియోలో జరుగుతుందని ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది, అక్కడ ఇంకాస్తా ఎక్కువగా అందరినీ చేరుకోవడానికి ప్రయత్నిస్తాము.

ఈ కార్యక్రం విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ—ధన్యవాదాలు. మీ అంకితభావం మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మా మిషన్‌లో ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడున్న ఆంకాలజీ ని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దాం.

డాక్టర్ ప్రియా కొర్రపాటి​

CEO, eMed Events, eMed Ed

Chairperson, Shankar Nethralaya USA

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events