తమ డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడిరచారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమ ని భావించినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత బైడెన్ తొలిసారి ప్రసంగించారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాల న్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని, దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షు రాలు కమలా హారిస్ సమర్థురాలంటూ ఓవల్ ఆఫీసు నుంచి చేసిన ప్రసంగంలో ఆమెను బైడెన్ ప్రశంసించా రు. ఆమె అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు.