Skip to main content

Namaste NRI

VISA వింటారా సరదాగా రెండో టీజర్‌ విడుదల

అశోక్‌ గల్లా, శ్రీగౌరీప్రియ జంటగా నటిస్తున్న యువతరం రొమాంటిక్‌ ప్రేమకథ VISA వింటారా సరదాగా. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, హర్ష చెముడు కీలక పాత్రధారులు. ఉద్భవ్‌ రఘు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా రెండో టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

పూర్తిగా కథానాయకుని కోణంలో ఈ టీజర్‌ సాగింది. అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితాల్లో ఎదురయ్యే ట్రబుల్స్‌ గురించి అశోక్‌ గల్లా పాత్ర తనదైన శైలిలో చెప్పే మాటలు టీజర్‌కి మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. సహజమైన సంభాషణలు, చురుకైన హాస్యం, మనసులను హత్తుకునే భావోద్వేగాలతో ఈ టీజర్‌ సాగింది. సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events