ఆకాష్ మురళి, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమిస్తావా. విష్ణువర్ధన్ దర్శకుడు. డాక్టర్ ఎస్.జేవియర్ బ్రిట్టో నిర్మాత. సంక్రాంతి కానుకగా తమిళంలో నేసిప్పాయా పేరుతో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ ప్రేమిస్తావా పేరుతో జనవరి 31న ఈ సినిమాను తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందని హీరో ఆకాష్ మురళి చెప్పారు. రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా ఇదని, పోర్చుగల్ లొకేషన్‌లో తీసిన సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయని, ఇందులోని క్రైమ్ ఎలిమెంట్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తున్నాయని దర్శకుడు తెలిపారు.