Skip to main content

Namaste NRI

వెంకటలక్ష్మితో యాడాది కిందట టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్‌

రఘు గద్వాల్‌, ప్రియాంకశ్రీ, శివ ప్రసన్న ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం వెంకటలక్ష్మీతో.. యాడాది కిందట అనేది ఉపశీర్షిక. రామ్మూర్తి కొట్టాల దర్శకుడు. ఆలేటి రాజేశ్‌ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని హీరో శ్రీకాంత్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని శ్రీకాంత్‌ అభిలషించారు. థ్రిల్లర్‌, సస్పెన్స్‌ అంశాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇదని, అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమా చేశామని, ఆడియన్స్‌కి ఫ్రెష్‌ ఫీల్‌ కలుగుతుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి, టి.మహిధర్‌, సంగీతం: సీఎన్‌ ఆదిత్య, నిర్మాణం: టింట్‌ స్ప్రీ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News