నాని హీరోగా మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా రూపొందిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. టీజర్ చూశారు, పాటలు చూశారు.. ఈ రోజు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది బోలెండంత ఉంది హాయ్ నాన్నలో అన్నారు.
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడు వీడెవడో బావున్నాడు అని అనిపించింది హాయ్ నాన్న సినిమాకే. సాన్‌జాన్ నన్ను చాలా బాగా చూపించాడు. సినిమా అనేది నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఓట్టేసి చెబుతున్నా. డిసెంబర్ 7న మీరంతా హాయ్ నాన్న ప్రేమలో పడతారు. మిమ్మల్ని ప్రేమలో పడేసే బాధ్యత మా అందరిదీ. బాక్సాఫీసు బాధ్యత మాత్రం మీదే అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్.