Namaste NRI

హాయ్ నాన్న మూడో సింగిల్ వచ్చేస్తోంది

హీరో నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా రూపొందుతున్న చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడు. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. నవంబర్‌ 4న ఈ సినిమాకు చెందిన థర్డ్‌ సింగల్‌ని విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. అమ్మాడీ అంటూ సాగే ఈ పాట ఓ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ నంబర్‌ అని, విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాలకూ నచ్చుతుందని, మృణాళ్‌ ఠాకూర్‌, నాని కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని, నాని కుమార్తె పాత్ర పోషించిన బేబీ కియారా ఖన్నా పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని మేకర్స్‌ చెబుతున్నారు.  హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్లో ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగిల్స్‌ని ఇప్పటికే విడుదల చేశారు. అవి మంచి ప్రజాదరణ పొందుతున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. డిసెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events