Skip to main content

Namaste NRI

హాయ్ మూవీ ట్రైలర్ విడుదల

నయనతార, యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా మూవీ హాయ్. ప్రముఖ గీత రచయిత విష్ణు ఎడవన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. త‌మిళంతో పాటు తెలుగు ట్రైల‌ర్‌ను వ‌దిలింది.ఈ ట్రైలర్ ఫుల్ లవ్, ఫన్ మరియు ఎమోషన్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ వివాహాల కోసం ప్రయత్నించి విఫలమయ్యే సామాన్యుడిగా కవిన్ ఇందులో కనిపించగా, ఆయనకు దేవసేన‌ పాత్రలో నటిస్తున్న నయనతార ఎదురుకావడం జరుగుతుంది. సంప్రదాయాలకు భిన్నంగా ఉండే ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా నయనతార లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరికీ పెళ్లి జరగడం, ఆ తర్వాత వారి మధ్య జరిగే మనస్పర్థలు, భావోద్వేగాలు ఈ సినిమా ప్రధాన కథాంశంగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కవిన్, నయనతార ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉండి సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రంలో నయనతార, కవిన్‌లతో పాటు కే. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జెన్ మార్టిన్ సంగీతం అందిస్తుండగా, రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. జి స్టూడియోస్ సౌత్, రౌడీ పిక్చర్స్ మరియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ తెచ్చుకున్న‌ ఈ చిత్రం, ఆగస్టు 28న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events