టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో బుక్‌లెట్ రూపంలో పిటిషనర్ ఆది శ్రీనివాసరావు తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఓసీఐ కార్డ్‌పై భారత్‌కు వచ్చి జర్మనీ పాస్‌పోర్టు మీద వెళ్తున్నట్లు చెప్పారు. ఇండియా పాస్ట్ పోర్ట్ లేకుండా జర్మనీ పాస్‌పోర్టుతో ఇండియా మీదుగా ప్రయాణాలు చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఓసీఐ కార్డులో జర్మనీ అని నేషనాలిటీ అని ఎలా రాస్తారని న్యాయవాది రవికిరణ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని హైకోర్టు పేర్కొంది. కాగా, తమ పిటిషనర్ చెన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తామని చెన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.