Namaste NRI

సెలబ్రిటీల జీవితాల్లోని విశేషాలే.. ది రానా దగ్గుబాటి షో

ది రానా దగ్గుబాటి షో పేరుతో హీరో రానా సెలబ్రిటీ టాక్‌షోకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్పిరిట్‌ మీడియా పతాకంపై స్వీయ నిర్మాణంలో రానా ఈ టాక్‌షోను రూపొందించారు. శుక్రవారం టాక్‌షోకు సంబంధిం చిన ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ఇది వరకు నేను కొన్ని టాక్‌షోలు చేశాను. కానీ ఇది చాలా విభిన్నమైనది.  ఇతర టాక్‌షోల మాదిరిగా ఎలాంటి నాటకీతయ లేకుండా సహజంగా అనిపి స్తుంది. ఎలాంటి ముందస్తు స్క్రిప్ట్‌ లేకుండా సెలబ్రిటీల మదిలోని భావాల్ని యథాతథంగా ఆవిష్కరిస్తుంది. వారికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేస్తుంది. 240 దేశాల్లో ఈ షో ప్రసార మవుతుంది  అన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.  ది రానా దగ్గుబాటి షో లో దుల్కర్‌ సల్మాన్‌, నాగచైతన్య, నాని, రిషబ్‌శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ వంటి అనేకమంది ప్రముఖులు పాల్గొంటున్నారని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రతినిధులు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events