అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూతాడ 1మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.2కోట్లు) విరాళంగా ఇచ్చారు. భారీ విరాళాన్ని అందించిన రమేశ భూటాడాను వర్శిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేశ్ భూటాడా మాట్లాడుతు రానురాను ఇటువంటి విద్యకు ఆదరణ తగ్గిపోతోంది. ఇటువంటి అరుదైన విద్యను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ వర్శిటీ కృషి చేస్తోంది. నేటి తరం యువత హిందూమతానికి సంబంధించిన విషయం పరిజ్ఞాన్ని అలవర్చుకోవాలని, తద్వారా చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆశించారు. అందుకే ఈ విరాళాన్ని అందించానని తెలిపారు. యూనివర్శిటీకి వచ్చిన విరాళాల్లో రమేశ్ భూటాడీ అందించిందే అతి పెద్ద విరాళం. 1989లో హెచ్‌యూఏ ఏర్పాటైంది. ఫ్లోరిడా రాష్ట్రంలో 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపుపొందిన హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా. అమెరికాలో హిందూ తత్వశాస్త్రం ఆధారంగా విద్యను అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే కావడం విశేషం.