Namaste NRI

అమెరికాలో హిందువులే టాప్‌

అమెరికాలో హిందువులు అత్యంత విద్యావంతులైన మత సమూహంగా ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనం తేల్చింది. హిందువుల తర్వాతి స్థానంలో యూదులు ఉన్నారు. వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ 2023-24 కాలానికి నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం ప్రకారం దాదాపు 70 శాతం మంది అమెరికాలోని హిందువులు కనీసంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ కలిగి ఉన్నారు.

హిందువులు తర్వాత యూదులు 65 శాతం మందికి డిగ్రీలు ఉన్నాయి. దీంతో పోలిస్తే అమెరికాలోని పౌరులంతా కలిపి కేవలం 35 శాతం మందికి మాత్రమే బ్యాచిలర్స్‌ డిగ్రీలు ఉన్నాయి. ముస్లింలు, బౌద్ధులు, సంప్రదాయ క్రైస్తవులు, ప్రధాన ప్రొటెస్టంట్‌ క్రైస్తవుల్లో ప్రతి 10 మంది పెద్దల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఉన్నత విద్యలో సగటు కంటే ఎక్కువ స్థాయికి దిగువన ఉన్నారని అధ్యయనం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events