రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ అక్కడి భారతీయ ఎంబీసీ మరోసారి సూచించింది. అక్కడి విద్యార్థులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ఓ హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. చాలా మంది తమను సంప్రదిస్తున్నారని, అయితే క్లాసులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది స్వదేశానికి తిరిగొచ్చేందుకు వెనకాడుతున్నారని తెలిపారు. తాము సురక్షితంగానే ఉన్నట్లు వారు పేర్కొన్నారని కూడా సదరు అధికారి తెలిపారు. ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో భారత్, ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
