Namaste NRI

హీరామండి సెకండ్ సీజ‌న్ వ‌చ్చేస్తుంది

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. స్వాతంత్య్రానికి ముందు లాహోర్‌లోని హీరామండి (వేశ్యావాటిక)లో జరిగిన పలు సంఘటనల ప్రకారం పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 01న స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ సిరీస్ మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ సిరీస్ ముగింపులో సెకండ్ సీజ‌న్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

తాజాగా సీజ‌న్ అనౌన్స్‌మెంట్‌ను ప్ర‌క‌టించింది. హీరామండి 2వ సీజ‌న్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక సెకండ్ సీజ‌న్‌లో వేశ్యలంద‌రూ హీరామండి (లాహోర్) నుంచి ఇండియాకు రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. 1947 విభజన తర్వాత లాహోర్‌ను విడిచిపెట్టి కొంత‌మంది ముంబై చిత్ర పరిశ్రమలో మరికొంత కోల్‌కతా చిత్ర పరిశ్రమలో స్థిరప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events