Namaste NRI

అత‌ని కోరిక నిజ‌మైంది.. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి.. అచ్చం శునకంలా

జిహ్వకో రుచి. పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు కార మానవు. అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్చగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు.అత‌ని కోరిక నిజ‌మైంది. కుక్క‌లా మారాల‌నుకున్నాడు. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. కుక్క బొచ్చును పెట్టుకున్నాడు. ఇక ఆ గెట‌ప్‌లో తొలిసారి జ‌నం మ‌ధ్య తిరిగాడు.

జ‌పాన్‌కు చెందిన ఆ వ్య‌క్తి పేరు టాకో. కుక్క కాస్టూమ్ కోసం 12 ల‌క్ష‌లు(14వేల డాల‌ర్లు) ఖ‌ర్చు చేశాడు. ఆ కుక్క బొచ్చును త‌యారు చేసేందుకు మేక‌ర్ల‌కు 40 రోజుల టైం ప‌ట్టింది. ఏదైతేనేం అత‌ను క‌న్న క‌ల‌ను నెర‌వేరాలా చేశారు. టాకోకు యూట్యూబ్ ఛాన‌ల్ ఉంది. అత‌నికి 33 వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. కుక్క కాస్టూమ్‌లో అత‌ను ఓ పార్క్‌లో తిరిగాడు. ఆ స‌మ‌యంలో కొంద‌రు ఆ కుక్క‌తో చాట్ చేశారు. ఇక తోటి కుక్క‌లు కూడా టాకోను చూసి థ్రిల్ అయ్యాయి. త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అత‌ను తొలిసారి వీడియోలు పోస్టు చేశాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events