దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్28 సదస్సులో 200 దేశాలు చారిత్రక ఒప్పందంపై సంతకం చేశాయి. శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాలేనని, వీటి వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్న నిర్ణయానికి వచ్చాయి. గత కొన్ని రోజులుగా సంపన్న, వర్ధమాన దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు ఈ ఒప్పందంతో చల్లారాయి. శతాబ్దాల తరబడి శిలాజ ఇంధనాలతో లాభాలు పొందిన సంపన్న దేశాలు ఇప్పుడు వాటిని తిరస్కరించటం న్యాయం కాదని వర్ధమాన దేశాలు వాదిస్తున్నాయి. అయితే, ఇది మనుగడ కోసం జరిగే యుద్ధమని అమెరికా వ్యాఖ్యానిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒప్పందం కొలిక్కి రావటం కష్టమేనని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2050 నాటికి సున్నాకు తగ్గించాలన్న ప్రతిపాదనలతో ఒప్పందంపై దేశాలన్నీ సంతకం చేశాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)