అడివిశేష్ హీరోగా నటించిన తాజా చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్. ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్లకు కంగ్రాట్స్. ఆదంత ఈజీ కాదు. హిట్ సినిమా చేయొచ్చు కానీ ఫ్రాంచైజీ చాలా కష్టం. సాధారణంగా హీరోకో, దర్శకుడికో ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం అనేది ఇడియాలోనే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్కు అభినందనలు. ట్రైలర్ చూస్తూంటేనే సినిమాలోని హత్యలను చేసే హంతకుడెవరు. వెంటనే సినిమా చూడాలనిపించింది. హిట్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో డౌటే అక్కర్లేదు. హిట్ 3, హిట్ 4, హిట్ 5 వరుసగా వస్తాయి. అందులో డౌట్ లేదు. అయితే ప్రతి సినిమా ఒకే సినిమాలో రావాలి అది హిట్ సీజన్ కావాలి అన్నారు. నాని మాట్లాడుతూ హిట్ 2 సినిమా గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడనని, అందరూ అన్నీ విషయాలను చెప్పారని అన్నారు. ఈ సినిమాపై అందరి ప్రేమ, గౌరవం ఎలా ఉందో చూసే ఉంటారన్నారు. శైలేస్ కొలను మాట్లాడుతూ ఎక్కడో కూర్చొని ఓ యూనివర్స్ను క్రియేట్ చేయాలని ఆలోచించానని, ఇపుడది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడివి శేష్, హీరోయిన్ మీనాక్ష చౌదరి, చిత్ర నిర్మాత ప్రశాంతి త్రిపురనేని, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ, విశ్వక్సేన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుది.