తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు జోరు కొనసాగుతోంది. హిట్ కి ఫ్రాంచైజీ గా హిట్ 2 తెరకెక్కింది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిట్`2 ది సెకండ్ కేస్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ను సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిరినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ ఏపీకి చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణదేవ్ అలియాస్ కేడీ పాత్రలో కనిపించబోతున్నారు. పరిశోధనాత్మక థ్రిల్లర్‌గా సాగే చిత్రమిది. ఓ కేసును చేధించే క్రమంలో చోటు చేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయి. అడివిశేష్ పవర్ పుల్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంటారు అని చిత్రబృందం పేర్కొంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 22న విడుదల చేయబోతున్నారు.














