Skip to main content

Namaste NRI

రణబాలిలో హాలీవుడ్ నటుడు ..ఫస్ట్ లుక్ విడుదల!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రణబాలి. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఇదిలావుంటే, ఈ భారతీయ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ది మమ్మీ ఫేం ఆర్నాల్డ్‌ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులోని ఆయన పాత్ర పేరు సర్‌ థియోడోర్‌ హెక్టర్‌. మంగళవారం ఆర్నాల్డ్‌ వోస్లూ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

కరవు నేల రాక్షసుడు.. సర్‌ థియోడోర్‌ హెక్టర్‌ అంటూ ఈ పోస్టర్‌లో ఆయన పాత్రను పరిచయం చేశారు. 19వ శతాబ్దంలోని బ్రిటీష్‌ పాలనాకాలంలో తెలుగునేలపై ఏర్పడ్డ డొక్కల కరువు నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రణబాలి సినిమా తెరకెక్కుతున్నట్టు వినికిడి. సెప్టెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌-అతుల్‌, సమర్పణ: గుల్షన్‌కుమార్‌, భూషణ్‌కుమార్‌, టీసిరీస్‌ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News