Skip to main content

Namaste NRI

మోహన్ లాల్ వృషభకి హాలీవుడ్ టచ్

స్టార్ హీరో మోహన్‌ లాల్‌  నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా వృషభ. ఈ చిత్రాన్ని బాలాజీ టెలీఫిలిమ్స్‌, కనెక్ట్‌ మీడియా, ఏవీస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఏక్తాకపూర్‌, వరుణ్ మథుర్‌, అభిషేక్ వ్యాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శనయ కపూర్‌, ఝరా ఎస్‌ ఖాన్‌, రాగిణి ద్వివేది, సిమ్రన్‌, గరుడ రామ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యాక్టర్‌ రోషన్‌ మేక కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ కాగా.. ముహూర్తపు సన్నివేశానికి ఊహ క్లాప్‌ కొట్టింది.

సినిమాలు అందించిన ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్ నిర్మాత నిక్‌ థర్‌లో  మోహన్‌లాల్‌ టీంతో జాయిన్ అయ్యాడు. హాలీవుడ్ టచ్‌ ఇచ్చేలా సినిమా ఉండబోతున్నట్టు మోడల్‌ సెట్‌ వీడియోతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. వృషభ చిత్రానికి రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వృషభ మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం 2024లో విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్‌ తెలియజేశారు మేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events