Namaste NRI

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించిన హొంబాలే ఫిలింస్

కేజీఎఫ్‌, సలార్‌, కాంతార వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది హోంబలే ఫిల్మ్స్‌. తాజాగా ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌ మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో పౌరాణిక సిరీస్‌ చిత్రాల రూపకల్పన కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఇందులో భాగంగా మహావతార్‌ నరసింహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అశ్విన్‌ కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా నుంచి రోర్‌ ఆఫ్‌ నరసింహ అనే పాటను విడుదల చేశారు.

మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో దశావతారాల్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ చిత్రాల్ని రూపొందించబోతున్నా మని హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. విష్ణుమూర్తి అవతారాలైన మహావతార్‌ పరశురామ్‌ (2027), మహావతార్‌ రఘనందన్‌ (2029), మహావతార్‌ ద్వారకాదీశ్‌ (2031), మహావతార్‌ గోకులనందన (2033), మహావతార్‌ కల్కి-1(2035), మహావతార్‌ కల్కి-2 (2037) చిత్రాలకు వరుసగా తీసుకురాబోతున్నామని తెలిపారు. జూలై 25న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News