తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహించేంది టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని మరోమారు నిరూపితం అయిందని ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావం, దీక్షతో పనిచేస్తున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన ఉద్యమ కాలంలో అరెస్టులై పలుమార్లు జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం అటు క్షేత్ర స్థాయిలో, ఇటు సోషల్ మీడియాలో ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.