నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా అమెరికాలోని తెలుగు కుటుంబాలకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ( జీడబ్ల్యూటీసీఎస్), చేనత ఫౌండేషన్ సంయుక్తంగా హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లను పంపిణీ చేశాయి. ఒక్కో కిట్‌ని 10 డాలర్లకే పంపిణీ చేశారు. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఉపయోగించుకునే కిట్లును ఈ సంఘాలు అందజేశాయి. ఈ కిట్లను జనవరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య మాంటిస్సోరి చిల్డ్రన్స్ సెంటర్, 2745 సెంటర్ విల్లే రోడ్, హెర్న్‌డన్, వర్జీనియా 20171 అడ్రస్‌లో పొందవచ్చని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయి సుధ తెలిపారు. మొత్తం మూడు వేల కిట్లు పంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయిసుధ, తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన, త్రిలోక్, అనిల్, రాంచౌదరి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)