నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్ నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇంటి నెం. 13. పన్నా రాయల్ దర్శకుడు. హేసన్ పాషా నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్రమిది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే మా టీజర్ పది లక్షల వ్యూస్‌ని దాటడం హ్యాపీగా ఉంది. ఇంటి నంబర్ 13లో జరుగుతున్న అనూహ్య పరిణామాల వెనకున్న చిక్కుముడిని ఓ వేటగాడు ఎలా చేధించాడు? ఆ ఇంటితో అతడికి ఉన్న సంబంధమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అని తెలిపారు. వైవిధ్యతను నమ్మి తాను నిర్మిస్తున్న చిత్రమిదని, త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత పేర్కొన్నారు. నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య.