
వయోలెన్స్, బ్లడ్ షేడ్‌తో కూడిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం రేచెల్. హనీరోజ్ కథానాయిక. ఆనందిని బాలా దర్శకత్వం. ఈ చిత్రానికి బాదుషా ఎన్.ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. హనీరోజ్ కొత్త అవతారాన్ని ఈ టీజర్‌లో ఆవిష్కరించారు. బాబురాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: స్వరూప్ ఫిలిప్, సంగీతం: ఇషాన్ ఛబ్రా.
