తానా ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుతాయనే నమ్మకం తో టీమ్ కొడాలి మరియూ టీమ్ గోగినేని ప్యానెల్స్ సిద్ధమవుతున్నాయి, తమ తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు కూడా. కోర్టు తీర్పు కోసం తానా బోర్డు, ఎన్నికల సంఘం ఎదురుచూస్తుంది. తీర్పు రావడమే తరువాయి తానా బోర్డు, ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలు జరపడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు సోషల్ మీడియా వేదికలపై ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
We Love and Live to Serve – టీమ్ కొడాలి
విశ్వసనీయమైన, నమ్మకమైన మరియు నిస్వార్థ సేవకులను ఎన్నుకోండి మరియు విలువలతో కూడిన ప్రభావవంతమైన సేవను అందించడానికి మాకు వీలు కల్పించండి అంటూ నరేన్ కొడాలి టీమ్ కోరుతుంది.
∆ Fight for Membership Rights.
∆ Inclusive Democracy
∆ Participatory Leadership
1) సభ్యులపట్ల అత్యంత గౌరవంగా ఉంటూనే వారి కోసం పోరాడటం.
2) వ్యక్తుల కంటే సంస్థ ప్రయోజనాలే ముఖ్యం
3) కష్ట సమయంలో సమిష్టి కృషి తో ముందుకు వెళ్లటం .
మేము సేవ చేయడానికి ఇష్టపడతాము మరియు జీవిస్తాము. దార్శనికత కలిగిన పెద్దలు , పూర్వ నాయకుల ఆశీస్సులు సలహాల సమిష్టి నిర్ణయం తో ముందుకు వెళతామని, దాతలు మరియు సభ్యుల ఓటు వేసి తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.ఎన్నికల బరిలో దిగిన కొడాలి టీమ్ తమ ప్యానెల్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
సమగ్రమైన అంకిత సేవే లక్ష్యం – టీమ్ గోగినేని
సభ్యుల మద్దతుతోనే సాధ్యం అంటూనే – తానా లో సరికొత్త శకానికి నాంది పలకాలంటే టీమ్ గోగినేని కి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
TANA is our Passion-Service is our Mission
సమగ్రత – సంస్కరణలు – అంకిత సేవ
Integrity – Reforms – Dedicated Service
సేవ చేసి వస్తున్నాము, సేవ చేస్తూ వస్తున్నాము, సేవ చేయటానికే వస్తున్నాము.బలపరచండి,గెలిపించండి అని కోరుతున్నారు.ఎన్నికల బరిలో దిగిన గోగినేని శ్రీనివాస్ తమ ప్యానెల్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.