Skip to main content

Namaste NRI

టెక్సాస్‌లో ఘోర ప్రమాదం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో సైనిక హెలికాప్టర్‌ కూలిపోవడంతో కార్చిచ్చు చెలరేగింది. మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లో వందల ఎకరాల మేర గడ్డి దగ్ధమైంది. దాంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సైనికులు మృతిచెందారు. సాలడో పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇది అత్యంత తీవ్రమైన ఘటన అని బెల్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

ప్రమాదానికి గురైన హెలికాప్ట‌ర్‌ ఏహెచ్‌-64 అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ అని ఫోర్ట్‌ హుడ్‌ సైనిక స్థావరం వెల్లడించింది. హెలికాప్టర్‌ కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. కాగా, గురువారం సాయంత్రానికి కార్చిచ్చును 50 శాతం అదుపులోకి తెచ్చినట్లు టెక్సాస్‌ అగ్నిమాపకశాఖ తెలిపింది. హెలికాప్టర్‌ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు యూఎస్‌ మిలిటరీ అధికారులు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events