Namaste NRI

హారర్‌ థ్రిల్లర్‌  ఎస్‌ 5 నో ఎగ్జిట్‌ రిలీజ్‌కు రెడి

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, ఆలీ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎస్‌ 5. నో ఎగ్జిట్‌. ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆదూరి ప్రతాప్‌ రెడ్డి, దేవు శ్యామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్‌ కోమలపాటి దర్శకుడు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ  నెల 30న విడుదలకు సిద్దమవుతున్నది. తాజాగా చిత్ర టీజర్‌ను నాయిక నందిత్వ శ్వేత అతిథిగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు నన్ను హారర్‌ క్వీన్‌ అని పిలుస్తుంటారు. నేను చేసిన సినిమాలు అలాంటి పేరు తీసుకొచ్చాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని భయపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.  దర్శకుడు భరత్‌ కోమలపాటి మాట్లాడుతూ హారర్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. సాంకేతికంగా బలమైన చిత్రమిది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress