Namaste NRI

బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది సాధించారు. ట్రంప్‌ కలల బిల్లు అయిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికన్‌ కాంగ్రెస్‌లో  సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌కు ఘన విజయం దక్కినట్లయింది. ఓటింగ్‌ సందర్భంగా ఇద్దరు రిపబ్లికన్‌ సభ్యులు కూడా డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. సెనేట్‌, ప్రతినిధుల సభ ఆమోదంతో బిల్లును అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. శుక్రవారం సాయంత్రం బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ వెల్లడించారు. దీంతో పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ట్రంప్‌ తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాలకు డెత్‌ ట్యాక్స్‌ నుంచి విముక్తి కల్పించానని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events