అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన హౌస్‌ఫుల్ సిరీస్ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆద్యంతం చక్కటి వినోదంతో ఈ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా హౌస్‌ఫుల్-5 రాబోతున్నది. ఈ సిరీస్‌లో ఐదో చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అక్షయ్‌కుమార్ తెలిపారు. హౌస్‌ఫుల్-5 చిత్రానికి తరుణ్ దర్శకత్వం వహించబోతున్నారు. సాజిద్ నదియావాల నిర్మాత. తొలి నాలుగు భాగాల్లో నటించిన ప్రధాన తారలు చాలా మంది ఈ ఐదో భాగంలో నటించనున్నారని సమాచారం. హౌస్‌ఫుల్-5 లో ఐదింతల వినోదం ఉంటుందని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. ఐదు భాగాలుగా తెరకెక్కించిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.