బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం, దుర్మార్గం అని బీఆర్ఎస్ బ్రిటన్ ఎన్నారై సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ దుసారి అని అన్నారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగా, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అన్యాయం, చట్ట విరుద్ధం అని ఆరోపించా రు . ఏడాదిన్నర క్రితం రెండు సార్లు నోటీసులు ఇచ్చి, శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానున్న సమయంలో ఒక రోజు ముందు శుక్రవారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడే కుటుంబం కాదన్నారు. ఎటువంటి బెదిరింపులకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులూ భయపడరని పేర్కొన్నారు.