ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి నొక్కిచెప్పింది. న్యూయార్క్‌లో జరిగిన ఐరాస 78వ సెషన్స్ ఇన్‌ఫార్మల్ సమావేశంలో తన గళాన్ని గట్టిగా వినిపించింది. మండలిలో సంస్కరణల కోసం 2000లో ప్రపంచ దేశాల నేతలు తీర్మానించారని, ఈ సంస్కరణల కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలని భారత ప్రతినిధి ప్రశ్నించారు.
