అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు అగ్రభాగాన ఉన్నారు. 2023 సంవత్సరంలో అత్యధి క అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్ నిలిచింది. గత ఏడాది అమెరికా 8,78,500 మందికి కొత్తగా పౌరసత్వం జారీచేసింది. వీరిలో 59,100 మంది భారతీయులు ఉన్నట్టు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్సీఐఎస్) తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మొత్తంగా అమెరికా పౌరస త్వం పొందిన విదేశాలకు చెందిన వారిలో 6.7 శాతం మంది భారతీయులే ఉండటం గమనా ర్హం. ఈ జాబితా లో 1.1 లక్షల పౌరసత్వాలతో మెక్సికో మొదటి స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లో ఫిలిప్పీన్స్, డొమినిక్ రిపబ్లిక్ నిలిచాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)