Skip to main content

Namaste NRI

ఛార్లెట్‌లో తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమానికి భారీ స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో తానా టీమ్ స్క్వేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దాదాపు 400మందికిపైగా పిల్లలు, పెద్దలు అందరూ హాజరై విజయవంతం చేశారు. సెప్టెంబర్ 20, ఆదివారం ఉదయం ఫ్రాంక్ లిస్కే పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తానా నాయకులు పలువురు హాజరయ్యారు. వచ్చినవారికి రుచికరమైన దక్షిణ భారత అల్పాహారం అందించారు. ఉచిత టీ షర్లులు, విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, సౌత్ ఈస్ట్ ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణలో భాగంగా మొదటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని, ఇదే విధంగా ఇతర నగరాల్లో కూడా నిర్వహిస్తామన్నారు. తానా టీమ్‌స్క్వేర్ ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా సౌమ్యశ్రీ తలంకి వ్యవహరించారు. జూంబా ఇన్‌స్ట్రక్టర్ మౌనిక కావలి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకులుగా మారథాన్‌ రన్నర్‌, తానా కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు గ్రహీత అయిన నవీన్‌ అప్పలనేని వ్యవహరించారు. ఆయన అంకితభావం, నాయకత్వం అందరికీ మార్గదర్శనంగా నిలిచింది.

తానా ఛార్లెట్ నాయకులు తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, తానా అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి, స్పెషల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి, హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, పట్టాభి కంఠంనేని తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. రన్‌ తర్వాత జరిగిన సమావేశంలో తానా నాయకులు మాట్లాడారు. తానా టీమ్‌ స్క్వేర్‌ ద్వారా తానా చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ, వాలంటీర్లకు, స్పాన్సర్లకు తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events