ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో అధిక సంఖ్యలో సబ్‌స్కైబ్రర్లు తగ్గినట్లు వెల్లడిరచింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ షేర్లు 35 శాతం పడిపోయాయి. దాని వల్ల ఆ సంస్థ సుమారు 50 బిలియన్ల డాలర్ల విలువైన మార్కెట్ షేర్‌ను కోల్పోయినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్రత్యర్థుల నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఆ కంపెనీ సబ్‌స్కైబ్రర్లు గణనీయంగా తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను కూడా నియంత్రించేందుకు నెట్‌ఫిక్స్ చర్యలు తీసుకున్నది. గడిచిన మూడు నెలల్లో రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గినట్టు నెట్‌ఫిక్స్ పేర్కొన్నది.