యశ్ నటిస్తున్న టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆమె ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ అర్థమవుతోంది. 2026లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై లేటెస్ట్‌గా హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌తో బజ్ మరింత పెరిగింది. తన ఎలిజిబెత్ పాత్ర గురించి హుమా ఖురేషి మాట్లాడుతూ ఇలాంటి ఓ కథను నువ్వు మాత్రమే కలగనవు. నీ విజన్‌ను చూసి,. టాక్సిక్ సినిమా కోసం మనం చేయబోయే సాహసాన్ని, ఎవరూ ఊహించని దాన్ని మనం వెండితెరపై చూపించబోతున్నామనే ఆలోచన చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అని అన్నారు.

హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా సిద్ధమవుతోంది.















