సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హంట్. మహేష్ దర్శకుడు. వి. ఆనంద ప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని పాపతో పైలం అనే లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. సుధీర్‌బాబుతో పాటు అప్పరా రాణి నర్తించిన ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ, నకాష్ ఆజీజ్ ఆలపించారు. స్టైలిష్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుధీర్, శ్రీకాంత్, భరత్ పోలీస్ అధికారుల పాత్రల్ని పోషించారు. నిర్మాత మాట్లాడుతూ ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్‌బాబు పాత్ర అందరిని ఆకట్టుకునే విధంగా వుంటంది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.
