Skip to main content

Namaste NRI

యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2

2018లో విడుదలై హుషారు చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్నది. హుషారు-2 సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. రాహుల్‌ రామకృష్ణ, అశోక్‌ గల్లా, రవి ఆంథోని, దినేష్‌తేజ్‌, శశిధర్‌ కోచర్లకోట తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీహర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఆసక్తినిరేకెత్తిస్తున్నది.

నేటి ట్రెండ్‌కు తగినట్లుగా విభిన్న కథాంశంతో ఆద్యంతం కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. తొలిభాగానికి మించిన రెట్టింపు వినోదంతో ఈ సీక్వెల్‌ను ఉంటుందని, షూటింగ్‌ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్‌ తెలిపారు. ఈ ఏడాది చివరలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సన్ని ఎం ఆర్‌, నిర్మాతలు: రాహుల్‌ వర్మ, కె.వీణా రాణి, కె.హనుమంత్‌ రాజు, రచన-దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events