Skip to main content

Namaste NRI

డి.సురేష్‌బాబు చేతుల మీదగా హుషార్‌ పిట్టలు ట్రైలర్‌ లాంచ్

అన్షు, వాసని గణేషన్‌ జంటగా నటిస్తున్న చిత్రం హుషార్‌ పిట్టలు. భిక్షు దర్శకత్వం. ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఏషియన్‌, సురేష్‌ ఫిల్మ్స్‌ ద్వారా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి, డబ్బుకు విలువనిచ్చే సినిమా ఇదని, మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని అన్నారు.

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుందని, యథార్థ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని దర్శకుడు భిక్షు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ సొంత ఊరికి వెళ్లిన అనుభూతిని కలిగించే సినిమా ఇదని నాయకానాయికలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events