హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు ప్రభుత్వం అనుమతి కోసం ఆమె ఎదురు చూస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఆమె విధులు నుంచి రెండు మూడు రోజుల్లో రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాటు ఆమె అక్కడే విద్యనభసిస్తారు. గత ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె తొమ్మిది నెలలుగా మేడ్చల్ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్నారు. కాగా ఆమె విధుల నుంచి రిలీవ్ అయితే హైదరాబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.