ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని చికాగోలో విషాదకర స్థితిలో ఉన్న హైదరాబాద్ పాతబస్తీ మహిళ సయిదా జైదీ కడగండ్లు తీర్చేందుకు రంగం సిద్ధం అయింది. విద్యాధికురాలైన ఆమె అనూహ్య పరిస్థితుల నడుమ చికాగో వీధుల్లో పార్క్వద్ద అడుక్కుని బతికే స్థితిలో ఉండగా హైదరాబాదీ ఒకరు గుర్తించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీనితో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. ఆమె వద్దకు సిబ్బంది వెళ్లింది. పూర్తి వైద్య సాయం, హైదరాబాద్కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఆమె మానసిక పరిస్థితి బాగా ఉందని, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తన తల్లితో ఫోన్ద్వారా మాట్లాడిందని కాన్సులేట్ వర్గాలు తెలిపాయి. ఆమెను కనుగొనడం కష్టమైంది. అయితే ఆమెను గుర్తించినట్లు , ఆమె హైదరాబాద్కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంత వరకూ అన్ని విధాలుగా ఇక్కడ ఆమె వసతి భోజన ఏర్పాట్లు చూస్తామని వివరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)