హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఇండిగో విమానం బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్`కాన్పూర్ మధ్య వారానికి (సోమవారం నుంచి శనివారం) ఆరు సార్లు ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇండిగో 6ఈ269 రోజూ ఉదయం కాన్పూర్ వెళ్లి తిరిగి సాయంత్ర 4:35 గంటలకు శంషాబాద్ చేరుకుంటుందన్నారు. అక్టోబర్ 17న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 50 వేలు దాటిందన్నారు. కొవిడ్ తగ్గిన తరువాత ఇదే అత్యధిక సంఖ్య అని జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.