కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను మీకు కావాల్సినవాడిని. సంజన ఆనంద్, సోనూ ఠాకూర్ కథానాయికలు. ఈ సినిమా నుంచి ఓ మాస్ పాటను విడుదల చేశారు. నేను అట్టాంటిట్టాంది దాన్ని కాదు మామో.. నీకు చెమటలు పట్టించికానీ పోను మామో. నీ కండలు కరిగించి కానీ పోను మామో. అంటూ హుషారుగా సాగిన ఈ పాటకు మణిశర్మ సంగీతాన్నందించారు. ఈ పాట యువతారాన్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్‌మీనన్ తదితరులు నటిస్తున్నారు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా : రాజ్ కె నల్లి, సమర్పణ : కోడి రామకృష్ణ, దర్శకత్వం : శ్రీధర్ గాదె.
